రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?

Adya News October 9th, 2020 01:30

లాక్ డౌన్ లో హైదరాబాద్ కి వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఎన్ని రోజుల సమయం తీసుకున్నాడో తెలిసింది.. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో కరోనా విజృంభిస్తున్న ఆ సమయంలో అందరిని గాలికి వదిలేసి చంద్రబాబు ప్రవర్తించిన తీరు పట్ల ఇప్పటికీ ప్రజల్లో ఆగ్రహం వుంది..ఇప్పటికే ఏడు నెలలుగా చంద్రబాబు, ఆయన తనయుడు కూడా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా జూమ్ కి పరిమితమయ్యారు. జనాలను ఆదుకునేందుకు ఆయన వ్యక్తిగతంగా సహాయం అందించిన దాఖాలాలు కనిపించలేదు.

వయసు రీత్యా చంద్రబాబు బయటకు రాలేకపోయినా ఆపార్టీ ప్రధానా కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇంటికే పరిమితం కావడం, తన బరువు తగ్గించుకోవడానికి ప్రాధాన్యత తప్ప, జనాలు భారంగా ఉన్నప్పుడు ఉపశమనం కలిగించే యత్నాలు చేయకపోవడం విస్మయకరమే. ఇక ఎదో జనాల కోసం పోరాడి వచ్చిన వారిలాగా చంద్రబాబు ఆ మధ్య చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చి కొంత హంగామా చేసే ప్రయత్నం చేశారు.. టీడీపీ శ్రేణులను హైవే పైకి పిలిచి స్వాగత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కూడా అప్పట్లో లాక్ డౌన్ సమయంలో హడావిడి చేసి ఈసారి ఎందుకు సైలెంట్ గా కరకట్టకు చేరుకున్నారోననే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి వచ్చినప్పుడు పెద్ద ప్రచారం చేసిన బాబు అనుకూల మీడియా ఈసారి దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

ఇక చంద్రబాబు తీరుపట్ల ఆయన పార్టీ లోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విషయాన్నీ పలువురు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. ఏపీని వదిలి హైదరాబాద్ లో స్థిరపడిన సమయంలో ప్రజలు తనని నమ్మే పరిస్థితి లేదని, తమను కూడా జనం ప్రశ్నిస్తున్నారని నేతలు కూడా చెప్పే శారు.. అమరావతి అంశంలో రోజువారీ విచారణ మొదలయ్యింది. వాటిని ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని టీడీపీ వదలడం లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ఏం సాధిస్తాడని ప్రజలు అంటున్నారు.. 

Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

rozbuzz Powered by RozBuzz
view source

Hot Comments

Recent Comments