భార్యామణులూ ఈవిషయాలు తెలుసుకుంటే మీ వైవాహిక జీవితం మరింత ఆనందమయం అవుతుంది...?

Hyndavi19 October 9th, 2020 11:16

credit: third party image reference

ఏ ఇంటిలో అయినా కూడా భార్య భర్త ఒకే మాట మీద ఉన్న ఇల్లు స్వర్గంలా ఉంటుంది. అలాగే భార్యామణులూ నుండి కూడా మగవారు కొన్ని ఉహించనివిధంగా కోరుకుంటారు అవేంటో తెలుసుకొని మీ వివాహ వ్యవస్థను దాంపత్య జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోండి. ఏ వివాహ బాహ్యాండానికి అయినా కూడా భార్య భర్తల అన్యోన్యత చాల అవసరం ఒకరి అభిప్రాయాలూ ఒకరు గౌరవిస్తే ఆ ఇంట సుఖ సంతోషాలు వెలువెత్తుతాయి. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సరదాగా సాగిపోవాలి అంటే ఇద్దరు అన్ని విషయాలలో ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు సర్దుకు పోతు ఉండాలి అప్పుడే ఆలు మగలా సంసారం మూడు పువ్వులు ఆరు కాయలు సాగిపోతుంది.సాధారణంగా అబ్బాయిలు సమయం దొరికినప్పుడల్లా అమ్మాయిలను పొగుడుతారు. అమ్మాయిలు పొగడ్తలను ఎక్కువ ఇష్టపడతారని మనకు తెలుసు. కానీ కొంతమంది మగవారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే అమ్మాయిల లాగానే అబ్భాయిలు కూడా పొగడ్తలను కోరుకుంటారట. అమ్మాయిలులా మేము ఎక్కువుగా కాదు గాని కొన్ని సరులైన పొగడ్తలు కోరుకుంటాం అని చెప్పారు. మగవారు వాళ్ళ భాగస్వాముల నుండి కొన్ని చిన్న విషయాలకైనా అభినందించాలి అనుకుంటారట. నిర్ణయాలు తీసుకోవడం..మాములుగా ప్రతి ఇంట్లో మగవాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆడవాళ్లు తక్కువుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆడవాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్న మగవారి ఫై ఆధారపడతారు. ఆడవాళ్లు నిర్ణయాలు తీసుకోవడం మగవారికి ఇష్టం ఉండదు అనుకుంటారు. కానీ మాతో కొంతమంది మగవారు చెప్పిందేంటంటే ఆడవారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారట. అంతేకాక ఆడవారు నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతగా ఉంటే మాకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా కూడా ఉంటుందని చెప్పారు.

డేట్ ప్లాన్ చేయడం

ఎక్కువుగా అబ్బాయిలు అమ్మాయిలను బయటకి తీసుకెళ్లడం, సినిమాలకి తీసుకెళ్లడం, షాపింగ్ కి తీసుకెళ్లడం చేస్తారు. తన భాగస్వామిని అబ్బాయిలు బాగా పెంపర్ చేస్తారు. ఆడవారు ఎక్కువగా పెంపరింగ్ కోరుకుంటారని తెలుసు. అబ్బాయిలు అమ్మాయిలను డేట్ కి ఎక్కువగా తీసుకెళ్తారు. కానీ మీకు తెలుసా, అబ్బాయిలు కూడా పెంపరింగ్ అంటే ఇష్టపడతారట. సహజంగా అబ్బాయిలు డేట్ ప్లాన్ చేస్తారు. ఎక్కువగా అమ్మాయిలకి సర్‌ప్రైజ్ లు ఇస్తారు. అమ్మాయిలు డేట్ ప్లాన్ చేసి అబ్బాయిలను బయటకు తీసుకెళ్లాలని అబ్బాయిలు కోరుకుంటారట. బయటకి తీసుకెళ్లి షాపింగ్ చేసి వాటికీ ఆమె మనీ పే చేస్తే అబ్బాయిలు చాలా సంతోషిస్తారట.

పువ్వులు ఇవ్వడం

అబ్బాయిలు అమ్మాయిలని ప్రపోజ్ చెయ్యడానికి లేదా వాళ్ళ భాగస్వాములను ఆనందంగా ఉంచడానికి ఎక్కువగా పువ్వులు గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా పూలను ఇష్టపడతారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే మగవారు కూడా పూలను ఇష్టపడతారు. వాళ్ళ భాగస్వాములు వాళ్ళకి కొన్ని సందర్భాల్లో పువ్వులు ఇవ్వడం మగవారికి చాలా సంతోషంగా ఉంటుందని కొందరు మాతో పంచుకున్నారు.

ఫోటోలు దిగడం

మేము ఏదైనా పని మీద బయటకి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లోనే మా పనులు చేసుకుంటునప్పుడు నా భార్య నా ఫోటోలు తియ్యడం నాకు చాలా ఇష్టం. ఇలా చెయ్యడం వల్ల నేను ఆమెను ఎంత ఇష్టపడుతున్నానో చెప్పడానికి నాకు ఒక మార్గం. నేను ఏదైనా పని చేస్తున్నపుడు ఆమె నాతో కొన్ని సెల్ఫీలు దిగడం నాకు చాలా ఇష్టం. ఇలా ఫోటోలు దిగడం నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. మాములుగా ఆడవారు ఎక్కువగా ఫోటోలు దిగుతూ వుంటారు. కాని భర్తతో కలిసి దిగడం వల్ల వాళ్ళు చాలా ఆనందపడతారట.

జుట్టును నిమరడం

ఇది వినటానికి చాలా చిన్న విషయం లా అనిపిస్తుంది కానీ నాకు ఇలా చేస్తే చాలా ఇష్టం. నేను ఏదైనా ఒత్తిడి లో ఉండి ఆమె వడిలో తల పెట్టుకుని పడుకున్నప్పుడు ఆమె నా జుట్టులో తన వేళ్ళు పెట్టి నిమురుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఎంతో ఆనందంగా ఉంటుందని కొందరు మాతో చెప్పారు.

తలుపు తీయడం...

నేను రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చేటప్పుడు నా భార్య నా కోసం ఎదురుచూస్తూ నేను రాగానే నాకోసం తలుపు తియ్యడం నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తే నేను ఎంతో సంతోషపడతాను.

తన అభిప్రాయాన్ని చెప్పడం

తనకు ఏదన్నా కావాలంటే మొహమాటం లేకుండా చెప్పడం. ఉదాహరణకు పుట్టినరోజుకు గాని లేదా ఏదైనా పండగకు గాని తనకు ఏంకావాలో నువ్వు కనుక్కో అనకుండా తను చెప్పటం నాకు చాలా ఇష్టం. అని కొంతమంది మాతో పంచుకున్నారు.ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుని మగవారికి తగ్గట్లుగా ఉంటె వారు సంతోషంతో మీరు కోరుకునేది మరింత ఆనందంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మగవారు కూడా ఆడవారు ఎలాంటి స్వాంతన కోరుకుంటున్నారో గ్రహించి వారికీ సహకరిస్తే ఆ వివాహ జీవితం పదిమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

rozbuzz Powered by RozBuzz
view source

Hot Comments

Recent Comments