ఆదిపురుష్ : శివుడి పాత్రలో మరో స్టార్ హీరో

Navya Media October 9th, 2020 07:35

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక శివుడి పాత్రలో బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ నటించే అవకాశాలున్నాయి. చిత్ర యూనిట్ శివుడి పాత్ర కోసం అజయ్ ని దాదాపుగా కన్ఫామ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రావణుడి పాత్ర కోసం మొదట అజయ్ నే సంప్రదించగా, ఆయన డేట్ల సమస్యతో సున్నితంగా తిరస్కరించారు. సైఫ్ సరేననడంతో రావణుడి పాత్రకు టిక్ మార్క్ పడింది. ఇక కీలకమైన శివుడి పాత్రకు అజయ్ అయితే సరిగ్గా సరిపోతాడని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారు. అజయ్ దేవగణ్, ఓం రౌత్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ తోనే దర్శకుడు అజయ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడట.

Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

rozbuzz Powered by RozBuzz
view source

Hot Comments

Recent Comments